తగ్గేదేలే.. ఆహాలోకి నిహారిక ఎంట్రీ!
on Feb 25, 2024
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓటీటీలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చాట్ షో ఆహా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 3 రాబోతోంది. ఈ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు.. సెలెబ్రిటీల ఫన్నీ చిట్ చాట్‌లు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఎపిసోడ్స్ వస్తుంటాయి.
ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఈ సారి ఈ మూడో సీజన్‌ను నిహారిక కొణిదెల హోస్ట్ చేస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఇకపై మరింత వినోదం, ఆటలు, ఆకర్షణీయమైన టాస్క్‌లతో నిండిన సరికొత్త షోని పరిచయం చేయబోతోన్నారు. నిహారిక తన మార్క్‌ను క్రియేట్ చేసేలా ఈ సీజన్ ఉండబోతోంది.
"చెఫ్ మంత్ర సీజన్ 3" చిత్ర పరిశ్రమలోని టాప్ అండ్ క్రేజీ స్టార్‌లను తీసుకురాబోతోన్నారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండబోతోన్నాయి. నిహారిక కొణిదెల గెస్టులతో పెట్టే ముచ్చట్లు, పంచుకునే భావోద్వేగాలు, నవ్వులు, మరపురాని క్షణాలు ఇలా షో అంతా కూడా రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. హృదయాన్ని కదిలించే కథల నుండి ఉల్లాసకరమైన ఆటల వరకు అన్నీ కూడా "చెఫ్ మంత్ర సీజన్ 3"లో ఉండబోతోన్నాయి.
మార్చి 3న చెఫ్ మంత్ర సీజన్ 3 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అటుపై ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారం అవుతాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
